Dasara: నాని.. ‘దసరా’ కోల్‌ మైన్‌ తయారైందిలా..!

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. బొగ్గు గనుల మధ్య కనుమరుగయ్యే దశలో ఉన్న ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంతో.. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ చిత్రానికి హైదరాబాద్ శివారు బాచుపల్లిలో 22 ఎకరాల్లో వీర్లపల్లి అనే గ్రామంతోపాటు బొగ్గు గనుల సెట్ వేయడం విశేషం. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్ల సారథ్యంలో.. మొత్తం 800 మంది కార్మికులు ఏడాది పాటు శ్రమించి ‘దసరా’ కోసం కోల్ మైనింగ్ సెట్‌ను తీర్చిదిద్దారు. 90 శాతం చిత్రీకరణ దాదాపు ఆ సెట్‌లోనే జరిగిందని అవినాష్‌ తెలిపారు. టాలీవుడ్‌లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు సరైన ఆదరణ లభిస్తే.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయంటున్నారు.

Published : 15 Mar 2023 20:21 IST

Tags :

మరిన్ని