Ishan Vs Virat: విరాట్‌ను అనుకరించిన ఇషాన్‌.. కౌంటర్‌ ఇచ్చిన కోహ్లీ.. వీడియో అదుర్స్

ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను టీమ్‌ఇండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రెజంటేషన్‌ సందర్భంగా భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌ మధ్య సరదా సంఘటనలు అభిమానులను మరింత ఖుషీ చేశాయి. తొలుత విరాట్ కోహ్లీ ఎలా నడుస్తాడని ఇషాన్‌ కిషన్‌ తన హావభావాలతో అనుకరించి చూపిస్తాడు. ఆ తర్వాత ఇషాన్‌కు కౌంటర్ ఇచ్చేలా కోహ్లీ కూడా దీటుగా స్పందించాడు. ఇషాన్‌ నడక ఇలా ఉంటుందని చూపించాడు. ఇదంతా చూసిన సహచరులు హాయిగా నవ్వుకున్నారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

Published : 18 Sep 2023 10:59 IST
Tags :

మరిన్ని