Mahabubnagar: మహబూబ్ నగర్.. ఏళ్లు గడుస్తున్నా సాగని ఐటీహబ్ పనులు..!

ఐటీహబ్ పేరుతో హడావిడి చేశారు. ఐదేళ్ల క్రితం భూములు తీసుకున్నారు. నాలుగున్నరేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నాయి కానీ కంపెనీలు రాలేదు. ఉద్యోగాలిచ్చిందీలేదు. పరిహారం కోసం రైతుల పడిగాపులు..! ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురుచూపులు..! మహబూబ్ నగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ పార్కు ఏర్పాటు పరిస్థితి ఇది..! ఐటీ హబ్ సంగతి అటుంచితే కాలుష్యం వెదజల్లే మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Published : 29 Jan 2023 13:30 IST
Tags :

మరిన్ని