HIDDEN STRIKE: జాకీచాన్‌ - జాన్‌ సెన ‘హిడెన్‌ స్ట్రైక్‌’.. ట్రైలర్‌ చూశారా?

మార్షల్‌ ఆర్ట్స్‌ ధీరుడు జాకీచాన్‌ (Jackie Chan), మల్లయోధుడు జాన్‌ సెన (John Cena) కలిసి నటించిన చిత్రం ‘హిడెన్‌ స్ట్రైక్‌’. స్కాట్‌ వాగ్‌ దర్శకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘భవిష్యత్తులో ఆయిల్‌ వార్‌ జరుగుతుంది. దాన్ని ఇద్దరే ఆపగలరు’ అనే ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలై.. మధ్యమధ్యలో వినోదం పంచే సన్నివేశాలతో విడుదలైన ఈ ట్రైలర్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘ఇద్దరు మాజీ ప్రత్యేక సైనిక దళాల వీరులు ఒక బృందాన్ని బాగ్దాద్‌లోని హైవే ఆఫ్‌ డెత్‌ నుంచి భద్రతయుతమైన గ్రీన్‌ జోన్‌కు తరలించాలి’. వారిద్దరూ ఆ బృందాన్ని ఎలా తరలిస్తారనేది ఈ సినిమాలో ఆసక్తికరం.

Published : 01 Jun 2023 20:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు