Adipurush: ‘ఆది పురుష్‌’ ‘జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌’ వచ్చేసింది

Adipurush: ప్రభాస్‌ కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’ (Adipurush). ప్రభాస్‌ రాఘవగా, జానకి పాత్రలో కృతిసనన్‌, లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా చిత్రంలోని ‘జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అజయ్‌-అతుల్‌ స్వరాలు సమకూర్చగా, తెలుగులో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.  ‘ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరికుందీ ఆ అధికారం.. పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హూంకారానికి.. ’ అంటూ ప్రభాస్‌ వాయిస్‌తో మొదలైన సాంగ్‌ వింటుంటే ఒళ్లు గగురుపొడిచేలా ఉంది. ఇక నుంచి ప్రతి శ్రీరామనవమికి ప్లే లిస్ట్‌లో ఈ పాట ఖాయమంటూ ప్రభాస్‌ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

Published : 20 May 2023 14:55 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు