Viral Video: ప్రతిదీ పిరమైన ఈరోజుల్లో ప్లేట్‌కు 10 పూరీలు.. సూపర్‌ కదా!

₹30కే 10 పూరీలు.. విత్‌ కరీ. ప్రతిదీ పిరమైన ఈరోజుల్లో ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా నిజమే. రాజస్థాన్‌లోని జయపుర (Jaipur)లో వీధి వ్యాపారం (street food stall) చేస్తున్న ఓ ఉదార జంట.. రూ.30కే 10 పూరీలను విక్రయిస్తోంది. పైగా టమాట, వెల్లుల్లి చట్నీ సైతం అందిస్తూ.. ఓ రకంగా సేవే చేస్తోంది. ‘Foodies.aao’ అనే ఫేస్‌బుక్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసిన వీరి వీడియో.. ప్రస్తుతం 5 వేల లైక్‌లు, 9.26 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సంపాదన కన్నా సేవకే ఎక్కువ ప్రాధాన్యం (serving than earning) ఇస్తున్న ఈ దంపతులు.. ఎంతైనా సూపర్‌ కదా..!

Updated : 13 Apr 2023 20:09 IST
Tags :

మరిన్ని