Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో డీఎస్పీ అరెస్టు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణ

ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి అరెస్టయ్యారు. డీఎస్పీ అయిన షేక్ ఆదిల్ ముస్తాఖ్.... ఉగ్రవాదులకు సహకరించటంతోపాటు ఆయనపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా... 6 రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతించినట్లు చెప్పారు. జులైలో అరెస్టయిన ఓ ఉగ్రవాది... తనకు పోలీసు ఉన్నతాధికారి షేక్ ఆదిల్ ముస్తాఖ్ సహకరించినట్లు విచారణ సందర్భంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Published : 22 Sep 2023 18:48 IST
Tags :

మరిన్ని