Srinagar: అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు చిరునామాగా కశ్మీర్‌!

జమ్ముకశ్మీర్‌ను అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు గమ్యస్థానంగా మార్చేందుకు.. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు దోహదపడింది. ఈ నెల 22 నుంచి శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమావేశాల్లో భాగంగా.. చిత్ర పర్యాటకం ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిపై దాని ప్రభావం అనే అంశంపై ప్రతినిధులు చర్చించారు. సినిమాలను చిత్రీకరించడానికి కశ్మీర్‌ను ఉత్తమమైన ప్రదేశంగా అభివర్ణించారు. రాబోయే కాలంలో చిత్ర నిర్మాతలు ఇక్కడి సుందరమైన ప్రాంతాల వైపు దృష్టి సారిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 26 May 2023 13:09 IST

మరిన్ని