Pawan Kalyan: నినాదాలు చేస్తే కాదు.. ఓట్లేస్తే సీఎం అవుతాం: పవన్‌ కల్యాణ్‌

పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా పోరాడాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. మంగళగిరిలో పార్టీ మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ‘‘కేకలు వేసి, గజమాలలు వేస్తే ముఖ్యమంత్రి కాలేరు. ఓట్లేస్తేనే అవుతారు. వ్యక్తిగతంగా నేనెక్కడికి వెళ్లినా విపరీతమైన ఆదరణ, ప్రేమ ఉంటుంది. ప్రేమ, ఆదరణ ఓట్లుగా మారనంత వరకు ఎంత ప్రజాభిమానం ఉన్న నిష్ప్రయోజనమే’’ అన్నారు.

Updated : 12 May 2023 19:24 IST
Tags :

మరిన్ని