Tadipatri: పారిశుద్ధ్య వాహనాల మరమ్మతులకు డబ్బులు కావాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి భిక్షాటన..!

దాతలనుంచి విరాళంగా తెచ్చిన వాహనాలను మూలన పడేసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను అద్దెకు పెట్టారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య వాహనాల పరమత్తులకు నిధులు కావాలంటూ చెడిపోయిన వాహనాలతో భిక్షాటనకు సిద్ధమైన ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గతంలో తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు జేసీబీలు, ప్రోక్లైన్లు ట్రాక్టర్లు వంటి వాహనాలను దాతల నుంచి విరాళంగా, సొంతంగా కొనుగోలు చేసి మున్సిపాలిటీకి ఇచ్చానని ఆయన అన్నారు. ఈ వాహనాలన్నిటిని చిన్నపాటి ఖర్చులతో మరమ్మతు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా మూలన పడేసి అద్దె వాహనాలను వాడుతున్నారని ఆయన విమర్శించారు. 

Published : 07 Dec 2022 15:30 IST

Tags :

మరిన్ని