AP News: తాడిపత్రిలో పీఎస్‌ ఎదుట బైఠాయించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్లపై వరుస దాడులను మున్పిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రబాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తమ కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవట్లేదని తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ ప్రభాకర్‌ రెడ్డి బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ చైతన్యకు, ప్రభాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సర్దిచెప్పి, నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పటంతో ఆందోళనను జేసీ విరమించారు. 

Published : 27 Sep 2022 16:44 IST

మరిన్ని

ap-districts
ts-districts