Kireeti: ‘జూనియర్‌’గా వచ్చేస్తున్న గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు

వ్యాపారవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘జూనియర్‌’గా టైటిల్‌ ఖరారైంది. ఈ మేరకు టైటిల్‌ను రివీల్‌ చేస్తూ చిత్ర బృందం ఓ వీడియో వదిలింది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. ‘పెళ్లి సందD’ ఫేమ్‌ శ్రీలీల కథానాయిక. ప్రముఖ నటి జెనీలియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, పోరాటాలు: పీటర్‌ హెయిన్‌.

Published : 30 Sep 2022 18:44 IST
Tags :

మరిన్ని