Kiccha Sudeep: భాజపా తరఫున ప్రచారానికి కిచ్చా సుదీప్ సై..

కర్ణాటకలో శాసనసభ ఎన్నికల వేడి (Karnataka Polls) అంతకంతకూ పెరుగుతోంది. కన్నడలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) వ్యవహారం.. రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది. భాజపాలో చేరుతారని విస్తృత ప్రచారం జరిగిన వేళ.. ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ ఆయనకు ఓ బెదిరింపు లేఖ కూడా వచ్చింది. తనకు లేఖ వచ్చినట్లు ధ్రువీకరించిన సుదీప్.. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎం బసవరాజ్ బొమ్మైతో సమావేశమైన సుదీప్.. భాజపా తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ మాత్రం చేయబోనని స్పష్టం చేశారు. 

Published : 05 Apr 2023 18:02 IST

Tags :

మరిన్ని