Kerala: లోదుస్తులకు పెయింట్‌లా వేసి బంగారం స్మగ్లింగ్‌..!

బంగారాన్ని లోదుస్తుల్లో దాచుకొని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కోజికోడ్‌కు చెందిన మహమ్మద్ సఫ్వాన్.. దుబాయ్ నుంచి కేరళకు వచ్చాడు. కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకున్న సఫ్వాన్.. ఆ తర్వాత మలప్పురం పోలీసులకు చిక్కాడు. సఫ్వాన్ ధరించిన ప్యాంటు, లోదుస్తులపై బంగారం మిశ్రమంతో పెయింట్ చేసినట్లు గుర్తించారు. ఆ దుస్తులను కత్తిరించి చూడగా.. దాదాపు 2 కిలోల బంగారం లభించింది. బంగారు మిశ్రమంతో కూడిన వస్తువులు తరలిస్తున్న వారిని.. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట పట్టుకోవడం ఇది 12వసారి అని పోలీసులు తెలిపారు.

Updated : 22 Feb 2023 18:02 IST

Tags :

మరిన్ని