Virat Kohli: వెల్లువెత్తిన అభిమానం.. సుదర్శన్‌ థియేటర్‌ వద్ద కింగ్‌ కోహ్లీ భారీ కటౌట్‌

పరుగుల రారాజు.. రికార్డుల యోధుడు.. ఛేదనలో మేటి.. ఇలా అతడి ఆటతీరు గురించి ఎంతగా వర్ణించినా సరిపోదేమో..! రికార్డులను బ్రేక్‌ చేస్తూ.. క్రికెట్‌ ప్రపంచంలో కొత్త చరిత్రను లిఖిస్తున్న ‘కింగ్’ విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజు నేడు. పొట్టి ప్రపంచ కప్‌ నేపథ్యంలో ఈ రోజును అతడి అభిమానులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఈ సందడి కనిపించింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌ ముందు కోహ్లీ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్‌ ఈ ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. అర్ధ శతకాలతో దూసుకుపోతూ.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Updated : 05 Nov 2022 11:36 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు