Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు?: బండి

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఎన్నికల తర్వాత ఏ విధంగా కలిసిపోతారో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంగా చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని పేర్కొన్న ఆయన.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఇంకా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడిన కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు అనేక సందర్భల్లో కలిసి పనిచేశాయని గుర్తు చేశారు.

Updated : 15 Feb 2023 21:57 IST
Tags :

మరిన్ని