Komatireddy: నేను ప్రచారం చేసినా కాంగ్రెస్‌ గెలవదు: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ తరఫున తాను ప్రచారం చేసినా ప్రయోజనం లేదన్నారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక వేళ.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి అక్కడి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌.. తెరాస, భాజపాలను తట్టుకోవడం కష్టమని చెప్పారు. తాను ప్రచారం చేస్తే పదివేల ఓట్లు వస్తాయేమో కానీ కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు లేవని వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 22 Oct 2022 14:51 IST

Tags :

మరిన్ని