Komatireddy: ఆ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్ అధిష్ఠానం తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే నేను మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయాను. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు ఠాక్రేను ఎందుకు కలవలేదో ముందు అడగాలి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో నేను కూర్చోవాలా?’’ అని ప్రశ్నించారు. 

Published : 12 Jan 2023 15:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు