Naga Shaurya: కసి ఉంటే ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు: హీరో నాగశౌర్య

‘సినిమా బాగుంటే నా కొడుకు బాగుంటాడు. అతని దర్శకులు, స్టాఫ్‌ బాగుంటారు’ అనే ఉద్దేశంతోనే.. తన తల్లిదండ్రులు ‘కృష్ణ వ్రింద విహారి’ని తప్పకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించారని నటుడు నాగశౌర్య తెలిపారు. ఐరా ప్రొడక్షన్స్‌ తనది మాత్రమే అనటం కంటే మాది అనటం మంచిదనిపిస్తుందన్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగశౌర్య మాట్లాడారు. కలలు నిజం చేసుకోవాలనే.. కసి ఉంటే ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చని చెప్పారు. 

Published : 21 Sep 2022 16:43 IST

Tags :

మరిన్ని