Thodelu: ‘తోడేలు’లో నా లుక్‌ అలా ఉండటం చాలా ముఖ్యం: కృతి సనన్‌

వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘తోడేలు’. దినేష్‌ విజన్‌ తెరకెక్కించారు. తెలుగులో అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ ఈవెంట్‌లో నటి కృతి సనన్‌ పాల్గొని మాట్లాడారు. ‘1 నేనొక్కడినే’తో నటిగా తెరపైకి వచ్చా. చాలాఏళ్ల తర్వాత ‘తోడేలు’తో తెలుగు వారిని పలకరించనున్నా. ఈ సినిమాని మీరంతా ప్రేమిస్తారని అనుకుంటున్నా. అలాగే ‘ఆదిపురుష్‌’ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నా’ అని ఆమె అన్నారు.

Published : 20 Nov 2022 16:40 IST

Tags :

మరిన్ని