KTR: తెల్లజుట్టు ఉంటే పిల్లను ఇవ్వర్రా బాబు..: నవ్వులు పూయించిన కేటీఆర్‌

సిరిసిల్ల బస్తీ దవాఖానా ప్రారంభోత్సవంలో సరదా సన్నివేశం చోటు చేసుకొంది. రాజీవ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత చిన్నారులతో సెల్ఫీ దిగుతున్న క్రమంలో ఓ బాలుడికి తెల్లజుట్టు ఉండటాన్ని మంత్రి కేటీఆర్‌ గమనించారు. ఇలా రావడానికి కారణమేంటని సమీపంలోని వైద్యుణ్ని అడిగారు. ఈ మేరకు బాలుడికి అవసరమైన మందులు వాడమని సలహా ఇచ్చిన కేటీఆర్‌.. తెల్లజుట్టు ఉంటే  పిల్లనివ్వరని వ్యాఖ్యానించడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

Published : 27 Sep 2022 21:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని