Lal Salaam: పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కిన ‘లాల్‌ సలామ్‌’

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్‌ సలామ్‌ (Lalsalam)’  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అతిథిగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు రజనీ. ఈ నేపథ్యంలో ‘లాల్‌సలామ్‌’ను లాంఛనంగా ప్రారంభిస్తూ చితృ బృందం పూజా కార్యక్రమాన్ని జరిపింది. ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 10 Nov 2022 21:51 IST

మరిన్ని