Lavanya Tripati: దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది: లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్‌ రాణా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. నటి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన చిత్రం. దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి సినిమా తెరపైకి వస్తుంది. నా క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుంది’’ అంది.

Published : 30 Jun 2022 11:03 IST

Tags :

మరిన్ని