Viral Video: సింహంతో ఆటలాడి చేతివేలు పోగొట్టుకున్న జూ కీపర్‌

సింహంతో ఆటలాడేందుకు యత్నించిన ఓ వ్యక్తి చేతివేలు పోగొట్టుకున్న ఘటన జమైకాలో చోటుచేసుకుంది. సింహం బోను వద్దకు వెళ్లిన జంతు ప్రదర్శనశాల సిబ్బంది  ఒకరు అత్యుత్సాహంతో కంచెలోపలికి చేయిపట్టి సింహాన్ని ఆడించేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపు మౌనంగానే ఉన్న మృగరాజు చూసినంత సేపు చూసి అతని ఉంగరపు వేలును నోటకరుచుకుంది. వేలును విడిపించుకునేందుకు జూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉంగరపు వేలు మొత్తం ఊడిపోయింది.

Published : 23 May 2022 20:54 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని