Mahanadu - Live: రాజమహేంద్రవరంలో తెదేపా మహానాడు.. ప్రత్యక్షప్రసారం

మహనాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఏడాది లోపే ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకులకు, శ్రేణులకు రాజమహేంద్రవరం మహానాడు వేదికగా దిశానిర్దేశం చేయనుంది. యువత నూతనోత్తేజం నింపేలా సరికొత్త ప్రణాళికలు రచించారు. మహానాడు వేదికగా శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసేలా చంద్రబాబు స్ఫూర్తి నింపనున్నారు. మహానాడు వేదికగానే నేడు ఎన్నికల తొలి మేనిఫెస్టో సైతం ప్రకటించనున్నారు. 

Published : 27 May 2023 10:34 IST
Tags :

మరిన్ని