Mahesh Babu: ‘గుంటూరు కారం’ ఘాటు చూపించనున్న మహేశ్‌బాబు

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ (Trivikram) కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)గా టైటిల్‌ ఫైనల్‌ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.

Updated : 31 May 2023 18:47 IST

Tags :

మరిన్ని