Wrestlers: పార్లమెంటు కొత్త భవనం వద్దకు వెళ్లేందుకు రెజ్లర్ల యత్నం.. ఉద్రిక్తత

‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిరసనలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building) వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ నుంచి నూతన పార్లమెంటు భవనానికి ర్యాలీగా వెళ్లేందుకు రెజ్లర్లు యత్నించారు. ఈ ఘటనలో రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బారికేడ్లను ఛేదించుకుని వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 28 May 2023 17:12 IST

Tags :

మరిన్ని