విజయనగరం జిల్లాలో విషాదం.. రహదారి సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి!

ఓ వైపు జోరు వాన మరో వైపు రహదారి లేమి. ప్రాణాలకు తెంగించి డోలీ సాయంతో జలాశయం దాటినా.. కడుపునొప్పి బారినపడిన వ్యక్తిని బతికించులేకపోయారు. దశాబ్దాలు మారినా మా తలరాత ఇంతే అంటూ నిట్టూర్చుతూ  మృతదేహంతో ఇంటిముఖం పట్టారు. ఈ హృదయ విదారకరమైన ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని దిగువ కొండపర్తి అనే గిరిజన గ్రామంలో జరిగింది. వైద్యం ఆలస్యంకావడంతో పాటు రహదారి సౌకర్యం లేక  ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 10 Oct 2022 16:20 IST

మరిన్ని