వైకాపా సర్పంచ్‌ దాడి.. అవమాన భారం భరించలేక వ్యక్తి బలవన్మరణం!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో సొంత పార్టీ నేతపైనే.. వైకాపా సర్పంచ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. అవినీతి అక్రమాలను నిలదీసినందుకు శ్రీను అనే వ్యక్తిపై వైకాపా సర్పంచ్ శోభన్ బాబు, అతని వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాల్ని గ్రామంలో వైరల్ చేస్తూ అవమానించారు. అవమాన భారం భరించలేక శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కూడా పట్టించుకోవడం లేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీను ఇవాళ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated : 04 Jun 2023 17:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు