Viral: కోడిని చోరీ చేయాలనుకున్నాడు.. పులి బోనులో చిక్కాడు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో వింత ఘటన జరిగింది. బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు యత్నించిన ఆ వ్యక్తికి ఈ దుస్థితి ఎదురైంది. కోడిని దొంగిలించే క్రమంలో డోర్ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి బోనులోనే ఉండిపోయాడు. 

Updated : 25 Feb 2023 12:43 IST

Tags :

మరిన్ని