Pulivendula: పులివెందులలో పేలిన తుపాకీ.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

పులివెందులలో తుపాకీ తూటాకు ఒకరు బలయ్యారు.. మరొకరు గాయపడ్డారు. ఆర్థిక లావాదేవీలపై ఏర్పడిన వివాదంతో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి.. దిలీప్, మహబూబ్ బాషా అనే ఇద్దరిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మృతిచెందారు. బాషా పులివెందుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన భరత్‌ను వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది.

Published : 28 Mar 2023 21:51 IST

మరిన్ని