Chiranjeevi: నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌: చిరంజీవి

‘‘చిరంజీవి వెనకాల ఏ గాడ్‌ఫాదర్‌ లేరని అంటుంటారు. ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి... ఈ స్థితిని ఇచ్చిన నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పించారు. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రం దసరా సందర్భంగా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది.

Published : 29 Sep 2022 10:08 IST

Tags :

మరిన్ని