Gangula Kamalakar: పర్యటనలో అపశ్రుతి.. మంత్రి గంగుల కమలాకర్‌కు గాయాలు

కరీంనగర్ జిల్లా చర్ల బూత్కూరులో మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ వేదికపై నుంచి గంగుల కింద పడిపోయారు. ఎక్కువ మంది రావడం వల్ల సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు మేయర్ సునీల్ రావు పరామర్శించారు.

Updated : 16 Apr 2023 16:36 IST

Tags :

మరిన్ని