Jogi Ramesh: ఒళ్లు జాగ్రత్త.. ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి జోగి రమేష్‌ చిందులు

ఒళ్లు జాగ్రత్త అంటూ జలవనరుల శాఖ ఉద్యోగులపై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కస్సుమన్నారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి.. జోగి రమేష్ అతిథిగా హాజరయ్యారు. తాను వేదిక మీదకు వస్తుంటే కనీస గౌరవం ఇవ్వాలని తెలియదా?అంటూ.. ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. జ్ఞానం లేదా అంటూ మండిపడ్డారు. కింది స్థాయి ఉద్యోగులకు ఏం నేర్పుతున్నారని జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Published : 06 Jun 2023 21:03 IST

మరిన్ని