YSRCP: దైవసాక్షిగా ప్రమాణానికి సిద్ధం.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి మంత్రి కాకాణి సవాల్‌

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) నోరు తెరిస్తే అబద్ధాలేనని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశానికి వచ్చిన మంత్రి.. సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. శ్రీధర్ రెడ్డి పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తనవద్ద ఫోన్ ట్యాపింగ్ ఆధారాలున్నాయని చెబుతున్న శ్రీధర్ రెడ్డి.. దానిపై కోర్టును ఆశ్రయించవచ్చని మంత్రి అన్నారు. 

Updated : 04 Feb 2023 16:00 IST

Tags :

మరిన్ని