Roja: శ్వాస తీసుకోవాలో.. వద్దో.. కేసీఆర్‌ను అడగండి: పవన్‌కు రోజా కౌంటర్‌

పవన్ వాహనం వారాహి కాదని.. అది నారాహి అని మంత్రి రోజా ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వారాహి రంగుపై పవన్ కల్యాణ్‌ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనసేన అన్నారు. పవన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదన్నారు. హైదరాబాద్‌లో బతికే పవన్.. శ్వాస తీసుకోవాలా వద్దా అనేది కేసీఆర్, కేటీఆర్‌ను అడగాలన్నారు. 

Updated : 11 Dec 2022 10:21 IST
Tags :

మరిన్ని