Srinivas goud: అబద్ధాలు చెప్పిన కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్‌ గౌడ్‌

ఒక మహిళ గోప్యత, ప్రతిష్ఠ దెబ్బతినేలా భాజపా నేతలు మాట్లాడారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా భాజపా నేతలు ఇప్పుడు ఏం జవాబు చెబుతారని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పిన కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, వేల కోట్లు ఎగవేసిన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలను కేంద్రం ఎందుకు వదిలేసిందని శ్రీనివాస్‌గౌడ్‌ నిలదీశారు. 

Published : 21 Mar 2023 15:33 IST

మరిన్ని