Rape Case: మైనర్‌ బాలికపై ఆర్‌ఎంపీ వైద్యుడి అఘాయిత్యం..

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఏడో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఆర్‌ఎంపీ వైద్యుడు వేగి రమేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం చేసేందుకు 6 నెలల కిందట ఇంటికి వచ్చి బాలిక దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి డాబాపై బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పారు.

Published : 04 May 2022 11:38 IST

మరిన్ని

ap-districts
ts-districts