YSRCP: ఎమ్మెల్యే అవంతి ఎదుట జడ్పీటీసీ సభ్యుడి సమస్యల గోడు..!

మండల పరిషత్ కార్యాలయ పరిసరాలనే పరిశుభ్రంగా చేసుకోలేకపోతే ఎలా...? కళ్ల ముందు కట్టిన ఇంటికే బిల్లు చేయకపోతే మనం ఎందుకు? ఈ ప్రశ్నలు సంధించిన వ్యక్తి విపక్ష పార్టీలకు నాయకుడు కాదు. అధికార వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యుడే. విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. విశాఖ వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సాక్షిగా జడ్పీడీసీ సభ్యుడు వెంకటప్పడు గోడు వెళ్లబుచ్చుకున్నారు. జడ్పీడీసీ వెంకటప్పడుకు అవంతి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన నిజాలు నిర్భయంగా వెల్లడించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈటీవీ ప్రతినిధిని.. వీడియో తీయడం ఆపాలంటూ అవంతి సూచించారు.

Published : 06 Nov 2022 14:18 IST
Tags :

మరిన్ని