‘డబ్బులు పంచడం కాదు.. గ్రామానికేం చేశారు?’: వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంతో పాటు లావేరు మండలం గోవిందపురం పంచాయతీ రాయునిపాలెంలో.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. స్థానికులు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేని నిలదీశారు. బటన్ నొక్కి డబ్బులు పంచడం కాకుండా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో గ్రామానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ‘ప్రతి ఇంటికి డబ్బులు వేస్తున్నాం కదా’ అని ఎమ్మెల్యే జవాబు చెప్పడంతో.. గతంలోనూ సంక్షేమ పథకాలు వచ్చాయంటూ గ్రామస్థులు నిలదీశారు. ముందు ఊర్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయగా.. ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Published : 10 Jun 2023 13:02 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు