Kotamreddy: నా గొంతు ఆగాలంటే.. ఎన్‌కౌంటర్‌ చేయించండి: కోటంరెడ్డి

అనుమానించిన చోట ఉండకూడదనే నీతిగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (kotamreddy) స్పష్టం చేశారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాకే నేను దూరం జరిగా. ఆ తర్వాత ఆధారం బయటపెట్టా. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేది. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్‌ చేయించండి’’ అని పేర్కొన్నారు.

Updated : 03 Feb 2023 11:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు