‘జగన్‌ గురించి మాట్లాడితే కారుకు కట్టుకొని ఈడ్చుకెళ్తా’: కోటంరెడ్డికి బెదిరింపు కాల్‌ వైరల్‌..!

‘ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan), సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య లాక్కొని వెళ్తాను. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరం లేదు. అయిదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా’ అంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాను ముఖ్యమంత్రిని ఏమీ అనలేదని చెప్పినా.. వినకుండా ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాపోయారు.

Updated : 04 Feb 2023 13:38 IST

మరిన్ని