Mekapati Chandrasekhar: ఎవరొస్తారో రండి.. నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని మేకపాటి సవాల్‌

నెల్లూరు జిల్లా ఉదయగిరి (Udayagiri)లో రాజకీయం వేడెక్కింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (MLA Mekapati Chandrasekhar Reddy)కి వ్యతిరేకంగా ఓ వర్గం ర్యాలీ చేపట్టింది. దీంతో ఆగ్రహించిన మేకపాటి.. రోడ్డు మీదకు వచ్చి సవాల్ విసిరారు. తాను వస్తే తరుముతామన్న వాళ్లు రావాలంటూ.. బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చుకున్నారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లో కలియతిరిగి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అధిష్ఠానం నాపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసింది. పార్టీలో లేనని చెప్పి కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఎవరొస్తారో రండి.. దమ్ముంటే తరిమికొట్టండి’’ అని సవాల్‌ విసిరారు.

Updated : 30 Mar 2023 20:03 IST

మరిన్ని