Mekapati VikramReddy: ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ‘సమస్యల’ స్వాగతం

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి (mekapati vikram reddy)ని ఎస్సీ కాలనీ వాసులు సమస్యలపై ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడులో.. నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ఎస్సీ కాలనీవాసులు వారి సమస్యల చిట్టాను వివరించారు. ఎస్సీలకు విద్యుత్ ఉచితం అని చెప్పి.. ఇప్పుడు వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి కట్టమని వేధిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా.. కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎమ్మెల్యే ఎదుటనే చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2023 19:25 IST

Tags :

మరిన్ని