Rajaiah: కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

భారాస (BRS) ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాలకు తనను ఆహ్వానించడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiam Srihari) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్య (Rajaiah) స్పందించారు. ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్సీలు ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నల్లగొండ జిల్లాకు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ క్లస్టర్ 1లో ఈ నెల 4న నిర్వహించబోయే సమావేశానికి ఆయన్ను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. 

Published : 02 Apr 2023 15:53 IST

మరిన్ని