Rapaka: ఆ దొంగ ఓట్లు నా విజయానికి సహకరించేవి!: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 24న జరిగిన వైకాపా(YSRCP) ఆత్మీయ సమ్మేళనంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు(Rapaka Varaprasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వం నుంచి తమ గ్రామం చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని చెప్పారు. ఆ ఓట్లతో తన విజయానికి సహకరించేవారని వ్యాఖ్యానించారు. 15 నుంచి 20 మంది వచ్చి.. ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా ఓట్లు వేసేవారన్నారు. దీంతో తనకు 800పైనే మెజారిటీ వచ్చేదని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated : 27 Mar 2023 13:44 IST
Tags :

మరిన్ని