MLC Kavitha: దిల్లీ మద్యం కేసు ఫిర్యాదు పత్రాలు పంపాలని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

దిల్లీ మద్యం కేసులో నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సీబీఐకి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ నకలు ప్రతిని తనకు అందించాలని ఆమె కోరారు. తాను అడిగిన పత్రాలను పంపిన తర్వాతే ఈ అంశంపై తాను వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలతో ఎదురవుతున్న సవాళ్లపై దీటుగా పోరాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కవితకు సూచించినట్లు తెలుస్తోంది.

Published : 04 Dec 2022 12:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు