Monsoon: ఆలస్యంగా రుతుపవనాలు.. నెమ్మదించడానికి కారణాలేంటి?

ఎప్పటిలాగే ఈ ఏడాదీ రుతుపవనాలు (Monsoon) కనుచూపుమేరలో కనిపించడం లేదు. రుతుపవనాల ఆలస్యంతో ఈ యేడు వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జూన్‌ నెల ప్రారంభమై వారం కావస్తున్నా ఇప్పటికే తీవ్రఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. వర్షాల కోసం మరిన్ని రోజులు నిరీక్షించక తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏటా జూన్‌ మెుదటివారంలో కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు.. ఈసారి ముఖం చాటేయడంతో వర్షాలు ఎప్పుడూ కురుస్తాయో తెలియక రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. రుతుపవనాలు నెమ్మదించడానికి కారణాలేంటి? 

Updated : 07 Jun 2023 16:15 IST

Tags :

మరిన్ని