Motkupalli: చంద్రబాబు అరెస్టు అక్రమం.. సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి!: మోత్కుపల్లి నరసింహులు

ప్రజల కోసం రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. రూ.300 కోట్లకు ఆశపడతారా? అని భారాస నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జగన్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. దళిత ద్రోహి అయిన జగన్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. దళితులు, పేదలు తిరుగుబాటు చేయకముందే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.

Updated : 23 Sep 2023 16:05 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు