Viral Video: పెట్రోల్ బంకులో.. బైక్‌కు మంటలు

హరియాణాలోని పంచకులలో పెట్రోల్ బంకులో బైక్‌కు మంటలు అంటుకోవడం కలకలం రేపింది. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాడు. బండిని స్టార్ట్ చేసేందుకు బటన్ నొక్కగానే మంటలు లేచాయి. మంటలు మరింత విస్తరించేసరికి ద్విచక్రవాహనాన్ని కింద పడేసి పక్కకు తప్పుకొన్నాడు. పెట్రోల్ బంకు సిబ్బంది ఫోమ్ చల్లి మంటలను అదుపులోకి తేవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 07 Jul 2022 11:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు